Skip to content

రాష్ట్రంలో ఏం జరుగుతోంది..?

March 30, 2014

రాష్ట్రంలో ఏం జరుగుతోంది..? రాష్ట్ర రాజకీయాలు ఎటు వెళుతున్నాయి..? రాష్ట్రం ముక్కలైందని ప్రజలు, ఉద్యోగావకాశాలు కోల్పోయామని యువత, ఉన్న ఉద్యోగాల పరిస్థితేంటో తేలక ఉద్యోగులు నానా కష్టాలు పడుతుంటే.. తలరాతలు మార్చేస్తామంటూ చెప్పుకునే రాజకీయ నాయకులు చేసేదేంటి..?

రాష్ట్ర విభజన బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపేసింది. రాష్ట్ర పతి సంతకం కూడా అయిపోయింది, ఇప్పుడు ఒకాయన నాకు 25 ఎంపీ సీట్లు ఇవ్వండి విభజనను ఆపేస్తాను అంటున్నారు. మరొకాయన అన్యాయంగా విభజించేశారు అంటున్నారు. అసలు విభజిస్తే నష్టమేంటని లెటర్‌ ఇచ్చింది కూడా ఆయనే.. ఇప్పుడేమో ఎలాగో విభజన జరిగిపోయింది. మాకు అధికారం ఇవ్వండి సీమాంధ్రను సింగపూర్‌ చేస్తాను అంటున్నారు. అయ్యా.. ! సీమాంధ్రను సింగపూర్‌ చెయ్యాల్సిన అవసరం లేదు కానీ. ఇక్కడ ఎవరికైనా జబ్బు చేస్తేనో.. ఆపరేషన్‌ చేయాల్సి వస్తేనో సింగపూర్‌ తీసుకెళ్ళాల్సిన పరిస్థితులు రాకుండా చేయండి ప్లీజ్‌..

మరొకాయన విభజన దుర్మార్గంగా చేశారంటున్నారు.. 2004 ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రాన్ని తప్పక ఏర్పాటు చేస్తానని చెప్పిందెవరో మర్చిపోయారు. సీమాంధ్ర ప్రజలకు అన్యాయం జరిగింది. మేం అధికారంలోకి వస్తేనే.. అభివృద్ధి జరుగుతుందని చెబుతున్నారు. ఆయనేమో ఇప్పటికీ క్విడ్‌ ప్రో కో కేసులో ఇప్పటికీ కోర్టు మెట్లు ఎక్కుతూనే ఉన్నారు..

అసలు ఏ నాయకుడన్నా ప్రజల కోసం ఆలోచిస్తున్నాడా.. ముందు మాకు అధికారం అందించేయండి మేం బాగు చేసేస్తాం. ఇదే తప్ప ఒక్క నాయకుడికన్నా.. సామాన్యులకున్న కష్టాలు తీర్చండి అని చెప్పే ధైర్యం ఉందా..?

పల్లెటూల్లే దేశానికి పట్టుకొమ్మలు అన్నారు. అలాంటిది దేశంలో సగం గ్రామాల్లో నీటి సౌకర్యం సరిగాలేదు. సగం గ్రామాలకు రవాణా సౌకర్యం లేదు. వైద్యం, విద్య, ఆరోగ్యం, ఇలా ఎన్నో రంగాల్లో చిన్నచిన్న దేశాలు, నిన్న మొన్న పుట్టుకొచ్చిన దేశాలకంటే వెనుకబడి ఉన్నాం. మనకు స్వాతంత్ర్యం వచ్చి 67 సంవత్సరాలు గడిచిందది. కానీ ఇన్ని రంగాల్లో వెనుకబడి ఉండడానికి కారణం ఎవరు..?

దేశాన్ని బాగు చేసేస్తాం అంటూ ఊదరగొట్టే ప్రసంగాలు చేసే నాయకులు ఈ 67 సంవత్సరాలుగా చేసిందేమిటి..? పక్క పార్టీలపైనా సొంత నేతలపైనా విమర్శలు చేస్తూ పబ్బంగడపడమే. ఒక్కసారి ఆలోచించండి.. మనల్ని నమ్మి ఓట్లేసిన జనాలకు మనం ఏం చేశామని..?……………………………

Advertisements

From → Vyasapeetham

Leave a Comment

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: